Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తానా 2015 తెలుగు సాహిత్య కార్యక్రమాలు

Advertiesment
20th TANA conference literary updates
, సోమవారం, 15 జూన్ 2015 (15:01 IST)
ఈ ఏడాది జులై 2వ తేదీ నుంచి 4వ తేదీవరకు జరిగే తానా 20వ మహాసభల్లో "తెలుగు సాహిత్యంలో స్త్రీ పాత్రల స్వభావ పరిణామం"అనే అంశంపై ఒక చర్చావేదిక నిర్వహించనున్నారు. ఈ చర్చకు వీలైనంత విశాల వేదిక కల్పించడానికై  ఒక వ్యాస రచనపోటీ నిర్వహించారు. ఈ పోటీకి అనూహ్యమైన స్పందనతో దేశ, విదేశాల నుంచి వ్యాసాలు అందాయి. 
 
పదిమందితో ఏర్పడిన న్యాయనిర్ణేతల బృందం మూడు వడపోతల తర్వాత నాలుగు బహుమతులు సిఫార్సు చేసింది. గెలుపొందిన విజేతల పేర్లు ఆదివారం, జూన్ 7వ తేదీన స్థానిక నోవై శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన సమావేశంలో ప్రకటించారు.
 
మొదటి బహుమతి రూ.27,232- చెరుకుపల్లి లావణ్య -హైదరాబాదు. 
రెండవ బహుమతి రూ.17314- డా.తన్నీరు కళ్యాణ్ కుమార్, తెనాలి.
మూడవ బహుమతి రూ.11,234 -పెద్దాడ సాయిసూర్య సుబ్బలక్ష్మి. హైదరాబాదు.
నాల్గవ బహుమతి- రూ.7000 -డా.అయ్యగారి సీతారత్నం. విశాఖపట్నం. 
 
ఈ బహుమతులు తానా సమావేశంలో అందజేస్తారు. తానా 2015 సాహిత్య కార్యక్రమాల కమిటీ అధ్యక్షులు డా.రాఘవేంద్ర చౌదరి విజేతలందరినీ సమావేశాలకు వచ్చి నగదు బహుమతీ, ప్రశంశా పత్రాలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.   సమావేశాలకు రాలేనివారికి ఆ తరువాత అందజేస్తామని చెప్పారు. ఎన్నికైన వ్యాసాలను తానా సమావేశాల సందర్భంగా విడుదల చేయనున్న ఒక  ప్రత్యేక పుస్తకంలో ప్రచురిస్తామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu