Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఛత్వాల్‌పై పిటీషన్‌: సుప్రీం ధర్మాసనం తిరస్కారం..!!

Advertiesment
పద్మభూషణ్ అవార్డు
FILE
ప్రముఖ ప్రవాస భారతీయ వ్యాపారవేత్త శాంత్ సింగ్ ఛత్వాల్‌ను ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేయటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఛత్వాల్‌కు వ్యతిరేకంగా స్వతంత్ర పాత్రికేయుడు ఎస్ కే షా వేసిన పిటీషన్‌ను విచారించేందుకు చీఫ్ జస్టీస్ మదన్ బీ లోకుర్ తిరస్కరించారు.

ఇదిలా ఉంటే.. సరైన నిబంధనలు పాటించకుండా ఛత్వాల్‌కు పద్మభూషన్ అవార్డును ప్రకటించారని పేర్కొంటూ, షా మార్చి 23న ఢిల్లీ హైకోర్టులో తన న్యాయవాది ఎస్సీ మెహతా ద్వారా పిటీషన్ దాఖలు చేశారు. వివిధ కేసులలో విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తిని, భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పురస్కారానికి ఎలా ఎంపిక చేస్తారని తన పిటీషన్‌లో షా ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకునేలా చేయాలని న్యాయస్థానానికి షా విజ్ఞప్తి చేశారు.

అయితే ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించేందుకు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మదన్ బీ లోకుర్ సారధ్యంలోని బెంచ్ అంగీకరించలేదు. ఛత్వాల్‌ ఎంపికకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు ముందుగానే అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీపీ మల్హొత్రాకు అందజేశారు. అయితే వాటిలో ఛత్వాల్‌పై ఆరోపించిన విషయాల్లో ఆధారాలు సరిగా లేవనీ, అవార్డు ఎంపికలో పొరపాట్లు లేనట్లు గుర్తించటంతో విచారణకు బెంచ్ విచారణకు తిరస్కరించింది.

Share this Story:

Follow Webdunia telugu