Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొబ్బరి పాలు - చేపల కూర.. భలే టేస్ట్

Advertiesment
కొబ్బరి పాలు - చేపల కూర.. భలే టేస్ట్
, బుధవారం, 6 మార్చి 2019 (21:57 IST)
ఇతర మాంసాహార పదార్థాల కంటే చేపలు ఉత్తమం. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చేపల్లో... ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఎ, బి, డి,  పుష్కలంగా ఉంటాయి. మరి ఇంత ఆరోగ్య ప్రయోజనాలున్న చేపలను రకారకాలుగా వండుకుని తింటే ఆ మజానే వేరు. కొబ్బరిపాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్‌లు రక్తంలో కొవ్వు నిల్వలు ఉండకుండా కాపాడుతాయి. మరి ఇన్ని ప్రయోజనాలున్న చేపలు, కొబ్బరి పాలు కలిపి కూర చేసుకుంటే రుచి, ఆరోగ్యం. ఇక మాంసాహార ప్రియులు లొట్టలేసుకుంటూ తినాల్సిందే. 
 
కొబ్బరిపాలతో చేపల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు:
చేపముక్కలు - 8, ఉల్లిపాయ పేస్ట్‌ - 4 స్పూన్లు, 
అల్లం వెల్లుల్లి పేస్ట్‌--4స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్‌- 4స్పూన్లు, 
జీలకర్ర పొడి- 4 స్పూన్లు, కారం పొడి- 4 స్పూన్లు,
పసుపు పొడి- 2 స్పూన్లు, గరం మసాలా పొడి- టీ స్పూన్‌,
జీలకర్ర- 2 స్పూన్లు, కొబ్బరి పాలు- రెండు కప్పులు,
నూనె- 4 స్పూన్లు, ఉప్పు- సరిపడా.
 
తయారీ విధానం
మొదటగా చేప ముక్కలకు కొద్దిగా పసుపు, ఉప్పు పట్టించి అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత చేప ముక్కలను నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. అయితే ముక్కలను మరీ ఎక్కువగా వేయించకూడదు. ఫ్రై చేసిన తర్వాత... చేపముక్కలను మరో ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
 
అదే పాత్రలో... మరికొంచెం.. నూనె వేసి కాగిన తర్వాత... జీలకర్ర,  వేసి నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్‌ కూడా వేసి బ్రౌన్‌ కలర్‌ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే అల్ల వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, కారం, వేసి కాసేపు వేయించాలి.
 
కొద్దిసేపటి తర్వాత... కొబ్బరి పాలను తీసుకొని... ఆ మిశ్రమంలో పోస్తూ... కలుపుతూ ఉండాలి. ఇప్పడు అందులో చేప ముక్కలు వేసి... చిన్నగా కలపాలి... తగినంత ఉప్పువేసి... చేపముక్కలు పూర్తిగా ఉడికే వరకూ సన్నని మంట మీద ఉడికించుకోవాలి.
 
చివరిగా అందులో గరం మసాలా పొడి వేసి, కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్ చేయాలి. 10 నిమిషాలు అలాగే ఉంచి... స్టౌ మీద నుంచి దించుకోవాలి. ఇక మీకు... కొబ్బ‌రి పాల‌తో 'ఫిష్' క‌ర్రీ రెడీ అయినట్లే. అన్నంతో తింటే చాలా బాగుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేపతో ఆ ప్రయోజనాలు తెలిస్తే...