గుమగుమలాడే గోంగూర రొయ్యల కూర!!
కావలసిన వస్తువులు!! గోంగూర : కప్పురొయ్యలు : పావుకప్పు,నెయ్యి/నూనె :4 చెంచాలుటమాటాలు : తగినన్నిఅల్లంవెల్లుల్లి పేస్ట్ : సరిపడాఉల్లిపాయలు : రెండుపచ్చిమిర్చి, ఎండుమిర్చి : నాలుగుతాళింపుదినుసులు : సరిపడాధనియాలపొడి : సరిపడా పసుపు : అరచెంచాకారం : 2 చెంచాలుఉప్పు : సరిపడకరివేపాకు, కొత్తిమీర : గార్నిషింగ్ఎలా తయారు చేయాలి? ముందుగా గోంగూర ఆకును బాగా కడిగి ఉడికించి పెట్టుకోవాలి. పాన్‌లో నెయ్యి లేదా నూనెను శుభ్రం చేసిన రొయ్యల్ని వేసి బాగా వేయించాలి. ఈ వేయించిన రొయ్యలను నెయ్యి లేకుండా విడిగా తీసిపెట్టుకోవాలి. ఈ మిగిలిన నెయ్యిలో ఎండుమిర్చి, తాలింపుదినుసులు ఉల్లిపాయముక్కలు, కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించాలి. అవి దోరగా వేగాక అల్లం వెల్లుల్లి మిశ్రమం ఆ తర్వాత టమాటా ముక్కలు చేర్చాలి. అనంతరం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర, కాస్త పసుపు, ఉప్పు, కారం వేసి మూతపెట్టాలి. కొద్దిసేపు కుతకుత ఉడికిన తర్వాత ధనియాలపొడి, వేయించిన రొయ్యల్ని చేర్చాలి. 5 లేదా 6 నిమిషాలు అయ్యాక కొత్తిమీర చల్లి దింపేస్తే గుమగమలాడే రుచికరమైన గంగూర మీకు సిద్దం.