Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్‌కు 60 ఏళ్లిచ్చారు.. నాకు 6 నెలలు ఇవ్వండి : మోడీ

Advertiesment
కాంగ్రెస్‌కు 60 ఏళ్లిచ్చారు.. నాకు 6 నెలలు ఇవ్వండి : మోడీ
, ఆదివారం, 19 జనవరి 2014 (14:52 IST)
FILE
'కాంగ్రెస్ పార్టీకి 60 ఏళ్లిచ్చారు. నాకు 6 నెలల సమయం ఇవ్వండి. దేశ గతిని మారుస్తా'నని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తెలిపారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ, టీ అమ్మేవాడిని చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని అన్నారు.

'మహిళలను గౌరవించడం, భద్రత కల్పించడం మన బాధ్యత' అని అన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో మానవవనరుల వినియోగంపై సరైన ప్రణాళిక లేదని, దానికి మార్గాన్ని చూపిస్తామని ఆయన అన్నారు.

దేశాభివృద్ధికి కావాల్సింది కమిటీలు కాదని, చిత్తశుద్ధి కావాలని ఆయన స్పష్టం చేశారు. దేశంలో సమర్థవంతమైన నాయకత్వం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని ఆయన మండిపడ్డారు.

ఏఐసీసీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోలేక పోయిందని అన్నారు. ఓటమి కళ్ల ముందే కనిపిస్తుంటే ఏ తల్లీ తన కుమారుడ్ని బలి చేయదని తెలిపారు. ప్రధానిని ఎంపీలు ఎన్నుకోవడం తమ సంప్రదాయం అంటున్న రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, రాజీవ్ గాంధీ లను ఎవరు ఎన్నుకున్నారో తెలుసుకోవాలని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu