ప్రధానికి రాహుల్ క్షమాపణ చెప్పాలి : చంద్రబాబు డిమాండ్
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు ...రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్పై రాహుల్ వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. ప్రధానమంత్రి పదవి కోసం రాహుల్ గాంధీ పాకులాడకుండా హుందాగా ప్రవర్తించాలని చంద్రబాబు సూచించారు.ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశ ప్రతిష్ట కాపాడేలా వ్యవహరించాలని.... ఇంత అవమానం జరిగినా తాను కుర్చీని వదలనని చెప్పటం ప్రధాని చెప్పటం దారుణమన్నారు. దేశం ప్రస్తుతం సంక్షోభంలో ఉందని, అందుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.ఆర్డినెన్స్‌పై చెలరేగిన వివాదాలకు తెరదించేందుకు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అమెరికా నుంచి తిరిగివచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కొద్ది సేపటి క్రితం రాహుల్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానితో వివాదాస్పద ఆర్డినెన్స్ గురించి రాహుల్ చర్చించారు. అంతే కాకుండా ఆర్డినెన్స్‌కు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై ప్రధానికి వివరణ ఇచ్చారు.