నరేంద్ర మోడీ : కాంగ్రెస్‌పై ABCD వ్యంగ్యాస్త్రాలు
, బుధవారం, 11 సెప్టెంబరు 2013 (12:20 IST)
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మరోమారు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ.. కాంగ్రెస్ పార్టీని ఏ, బీ, సీ, డీతో పోల్చారు. ఏ అంటే ఆదర్శ్, బి అంటే బోఫోర్స్, సి అంటే కోల్, డి అంటే రాబర్ట్ వాద్రా అక్రమాలంటూ కొత్త నిర్వచనం చేశారు. జైపూర్‌లో మంగళవారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఏ అంటే ఆదర్శ్ అక్రమాలు. బీ అంటే బోఫోర్స్ స్కాం. సీ అంటే కామన్వెల్త్, కోల్ కుంభకోణం. డి అంటే అల్లుడి వ్యాపారాలు అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో అవినీతికి అంతే లేదు. దానివల్ల ఇప్పుడే మన దేశమే విధ్వంసం అంచున ఉందన్నారు. మన దేశంలో ఈ అవినీతి పోవాలని యువత భావిస్తే.. కేంద్రంలో అధికారం నుంచి కాంగ్రెస్‌ను తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం విధ్వంసపుటంచున ఉంది. స్వాతంత్య్రానికి ముందు కాంగ్రెస్ వేరు. ఇప్పటి కాంగ్రెస్ వేరు. ఇప్పటి కాంగ్రెస్ కేవలం ఒక కుటుంబానికే పరిమితమైందంటూ ధ్వజమెత్తారు.