Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భూవివాదంలో చిక్కుకున్న రాష్ట్రపతి ప్రతిభా పాటిల్!

భూవివాదంలో చిక్కుకున్న రాష్ట్రపతి ప్రతిభా పాటిల్!
, శుక్రవారం, 13 ఏప్రియల్ 2012 (08:37 IST)
File
FILE
రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ మరో భూ వివాదంలో చిక్కుకున్నారు. వచ్చే జూన్ నెలలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. ఆమె ఈ తరహా వివాదంలో చిక్కుకోవడం గమనార్హం. పదవీ విరమణ తర్వాత మహారాష్ట్రలోని పుణెలో నివసించేందుకు ఆమె అంగీకరించగా అక్కడ రక్షణ శాఖ పరిధిలోని స్థలంలో ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ ఇంట్లో జూలై నుంచి ప్రతిభా పాటిల్ నివసిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణం జరుగుతోందని, వివరాలు బయటపెట్టాలని కోరుతూ మాజీ లెఫ్టనెంట్ కల్నల్ సురేశ్ పాటిల్ ఇటీవల సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేశారు.

నిబంధనల ప్రకారం 4,500 చదరపు అడుగుల్లో నివాస స్థలం ఉండాలని, అందులో 2 వేల చదరపు అడుగుల్లోనే ఇంటిని నిర్మించాల్సి ఉందని సురేశ్ పాటిల్ తన పిటీషన్‌లో పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా ఐదు ఎకరాల స్థలాన్ని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఇంటి నిర్మాణం కోసం ఉపయోగిస్తున్నారని, ఆ స్థలం మొత్తం ఫెన్సింగ్ వేశారని ఆయన ఆరోపించారు.

దీనిపై రాష్ట్రపతి కార్యాలయ అధికార ప్రతినిధి అర్చనా దత్తా స్పందించారు. పూణెలో రాష్ట్రపతి నివాసం నిబంధనల మేరకే జరుగుతోందన్నారు. పైపెచ్చు.. ఆమె జీవించి ఉన్నంత వరకు ఆ ఇంట్లోనే నివశిస్తున్నారని, ఆమె మరణానంతరం రక్షణ శాఖకు చెందుతుని అర్చనా దత్తా స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu