Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూత్ కాంగ్రెస్‌ పదవుల భర్తీకి ప్రత్యక్ష ఎన్నికలు: రాహుల్

యూత్ కాంగ్రెస్‌ పదవుల భర్తీకి ప్రత్యక్ష ఎన్నికలు: రాహుల్
కాంగ్రెస్ అనుబంధ సంస్థలైన యూత్ కాంగ్రెస్‌, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్.ఎస్.యు.ఐ) పదవుల భర్తీ ఇకపై ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరుగనుంది. ఈ తరహా ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ మొగ్గు చూపుతున్నారు. దీనిపై ఆయన గడ్చిరోలీలో మాట్లాడుతూ.. ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవులను ఎకపై నామినేటెడ్ పద్దతిలో భర్తీ చేయబోమని, ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరుగుతాయన్నారు.

మీ నేతను నేను ఎంపిక చేయను. మీ నేతను మీరే ఎంచుకోండి. మీరు ఎంచుకునే వ్యక్తి కుటుంబ నేపథ్యం గురించి ఎలాంటి బెంగ వద్దు. అయితే, ఆ ఎంపిక అతని శక్తిసామర్థ్యాలు, వ్యక్తిత్వం అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా ఆయన యువతకు ఒక విజ్ఞప్తి చేశారు. యూత్ కాంగ్రెస్‌లో చేరేందుకు యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందులో చేరేందుకు కులమతాలతో సంబంధం లేదని, అయితే, నేర చరిత్ర కలిగి ఉండరాదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu