Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మకరజ్యోతి రహస్యంపై దర్యాప్తు జరిపే ఉద్దేశ్యం లేదు: కేరళ

మకరజ్యోతి రహస్యంపై దర్యాప్తు జరిపే ఉద్దేశ్యం లేదు: కేరళ
శ్రీ అయ్యప్ప స్వామి కొలువుదీరిన శబరిమల పుణ్యక్షేత్రంలో ప్రతి యేడాది మకరసంక్రాంతి రోజున కనిపించే మకరజ్యోతి రహస్యాన్ని ఛేదించే అంశంపై దర్యాప్తు జరిపే ఉద్దేశ్యం తమకు లేదని కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలియజేసింది. ఈ జ్యోతిపై పలు రకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అది వారి భక్తి విశ్వాసలకు సంబంధించిన అంశమని పేర్కొంది.

ముఖ్యంగా... మకర సంక్రాంతి రోజున కనిపించే జ్యోతి దేవుని మహిమనా లేక మానవ కల్పితమా అన్నది లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించింది కనుక దీనిపై దర్యాప్తు జరిపించే ఆలోచన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వాస్తవానికి మకరజ్యోతి దర్శనానికి రెండు నెలల ముందు మకరవిలక్కు ప్రారంభమవుతుందని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు తెలిపారు. అందువల్ల ఈ జ్యోతిపై దర్యాప్తు జరిపాలనే ఉద్దేశ్యం తమకు లేదని ప్రభుత్వం తరపున కోర్టుకు హాజరైన న్యాయవాది డివిజన్ బెంచ్‌కు విన్నవించారు.

ఈనెల 14వ తేదీన శబరిమల పులిమేడులో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 107 మంది అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 150 మంది వరకు గాయపడిన విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu