దేశంలో నానానిటికీ హెచ్చుమీరి పోతున్న అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఒక బిల్లును తీసుకురానున్నట్టు కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్‌లకు అనుగుణంగా ఈ బిల్లు ఉంటుందన్నారు.
దీనిపై ఆయన ముంబైలో మాట్లాడుతూ.. అవినీతి కుంభకోణాలపై ఈ బిల్లుకు అనుగుణంగా సాగుతామని అన్నారు. మనం ఆ కన్వెన్షన్‌ను అంగీకరించాం. కానీ దానిపై ఆమోదం తెలిజేయలేదు. ఎన్డీయే ప్రభుత్వం దానిపై ఎలాంటి వైఖరినీ తీసుకోలేదన్నారు. ఇప్పుడు ఒకటి రెండు రోజుల క్రితం ఒక మంత్రుల బృందం ఐరాస కన్వెన్షన్‌ను పరిగణనలోకి తీసుకుంది. ఆమోదం కూడా తెలిపిందన్నారు.
ఇకపోతే.. విదేశీ బ్యాంకుల్లో నిల్వ ఉన్న నల్లధనం గురించి మాట్లాడుతూ.. రహస్య విషయాలు వెల్లడించరాదని ఆయా దేశాల మధ్య ఒప్పందాలు ఉంటాయన్నారు. వీటిని ఉల్లఘించలేమన్నారు. అందువల్ల ఈ రహస్య ఖాతాల వివరాలను అంత సులంభంగా వెల్లడించలేమన్నారు.