Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తొక్కిసలాట మృతులకు ప్రభుత్వానిదే బాధ్యత: హైకోర్టు

తొక్కిసలాట మృతులకు ప్రభుత్వానిదే బాధ్యత: హైకోర్టు
శబరిమల గిరుల్లో చోటు చేసుకున్న తొక్కిసలాటకు ప్రభుత్వానిదే బాధ్యత అని కేరళ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో శబరిమలలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 106 మంది మృత్యువాత పడిన విషయం తెల్సిందే. దీనిపై హైకోర్టులో దాఖలైన పిటీషన్‌పై విచారణ జరిపింది. ఈ ఘటనకు ప్రభుత్వంతో సహా శబరిమల దేవస్థానం బోర్డు, అటవీ శాఖ అధికారులు బాధ్యత వహిస్తూ, నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

గతంలో చంద్రశేఖర్ మీనన్ చేసిన సిఫార్సులను అమలు చేయకపోవటం వల్లే ఈ ఘోరకలి చోటు చేసుకున్నట్టు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కాగా, శబరిమల తొక్కిసలాటలో 106 మంది మరణించిన దుర్ఘటనకు కేరళ ప్రభుత్వం, దేవస్థానం బోర్డు నిర్లక్ష్యమే కారణమని తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu