Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా

Advertiesment
తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా
మకర జ్యోతి దర్శనం అనంతరం తిరిగి వస్తున్న సమయంలో శబరిమల గిరుల్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు కేరళ ప్రభుత్వం లక్ష రూపాయలు, గాయపడిన వారికి యాభై వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే, మూడు రోజుల అధికారిక సంతాప దినాలను అనుసరించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అచ్యుతానందన్ వెల్లడించారు. ఈ దుర్ఘటన పట్ల రాష్ట్రపత్రి ప్రతిభా పాటిల్, ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, కేరళ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రులు తీవ్ర విచారం, సంతాపం వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా, ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య శనివారం మధ్యాహ్నానికి 104కు చేరుకుందని, మరో 60 మంది వరకు గాయపడ్డారు. ఈ తొక్కిసలాట శుక్రవారం రాత్రి ఎనినిది గంటల సమయంలో చోటు చేసుకుంది. మకర జ్యోతి దర్శనం అనంతరం భక్తులు కొండ దిగి వస్తుండగా, కారు బ్రేకులు విఫలమై భక్తులపైకి దూసుకుని రావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నట్టు సమాచారం.
వండిపెరియారు పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పులుమేడు అనే అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతుల్లో ఒక శ్రీలంక వాసితో పాటు తమిళనాడుకు చెందిన 18 మంది భక్తులు, కర్ణాటకు చెందిన 12 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 17 మంది, కేరళకు చెందిన ముగ్గురు భక్తులు ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Share this Story:

Follow Webdunia telugu