మావోయిస్టు నేత ఆజాద్ గత జూలైలో ఎన్‌కౌంటర్‌కు గురవడంపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. మన పౌరులను మనమే చంపడమేమిటని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆజాద్ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు నోటీసులు పంపింది.
నాలుగు వారాల్లోపే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ ఎన్‌కౌంటర్‌పై లోతుగా అధ్యయనం జరగాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఎన్‌కౌంటర్లను సుప్రీ కోర్టు తప్పు బట్టింది.