ఇటలీ పారిశ్రామికవేత్త ఒట్టావియో ఖత్రోచీతో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకు దగ్గరి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ ఆరోపించారు. గౌహతిలో ఎన్డీయే తరపున జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
సోనియా గాంధీ ఇంటి వద్ద క్రమం తప్పుకుండా కనిపించేవారన్నారు. ఇది తాను ఏ ఒక్కరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయడం లేదన్నారు. అదేసమయంలో బోఫోర్స్ కుంభకోణంతో అంతర్జాతీయంగా భారత్ తన పరువు ప్రతిష్టలను కోల్పోయిందన్నారు.
బోఫోర్స్ కుంభకోణం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. ముఖ్యంగా, ఆదాయపన్ను శాఖ ట్రిబ్యునల్ కూడా ముడుపులు చేతులు మారినట్టు నిర్ధారించిందని అద్వానీ గుర్తు చేశారు. అయితే, సీబీఐ మాత్రం ఈ అంశాన్ని ప్రస్తావించలేదన్నారు.
మొత్తంమీద బోఫోర్స్ కుంభకోణం మాయని మచ్చగా మిగిలి పోయిందన్నారు. అందువల్ల దీనిపై తదుపరి దర్యాప్తునుకు ప్రధాని ఆదేశించాలని ఆయన కోరారు.