Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాడ్యూరప్ప అవినీతిపరుడు, సిగ్గులేని సీఎం: దేవెగౌడ

యాడ్యూరప్ప అవినీతిపరుడు, సిగ్గులేని సీఎం: దేవెగౌడ
, బుధవారం, 5 జనవరి 2011 (11:36 IST)
కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్. యాడ్యూరప్పపై నిప్పులు చెరిగారు మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) అధ్యక్షుడు హెచ్‌.డి. దేవెగౌడ. యాడ్యూరప్ప ఓ అవినీతిపరుడని, సిగ్గులేని ముఖ్యమంత్రిని ఆయన మండిపడ్డారు.

భాజాపా ఇతర రాజకీయ పార్టీల వైపు వేలెత్తి చూపేముందు తమ పార్టీ సభ్యుడు యాడ్యూరప్పపై వస్తున్న వివిధ అవినీతి ఆరోపణల గురించి ఒక్కసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు.

"భాజాపాకు ఏమాత్రం సిగ్గున్నా.. చాలా రకాల అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న తమ స్వంత ముఖ్యమంత్రి (కర్ణాటక సీఎం యాడ్యూరప్ప)పై ముందుగా చర్యలు తీసుకోవాల"ని గౌడ అన్నారు.

దేశ రాజధానిలో తమ నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా గౌడ ఈ వ్యాఖ్యలు చేశారు. "ఆ ముఖ్యమంత్రికి బొత్తిగా సిగ్గు లేదు. బంధుప్రీతితో ఇంత అవినీతికి పాల్పడ్డ ముఖ్యమంత్రిని చూడటం నా 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇదే తొలిసార"ని మాజీ ప్రధాని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu