2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రజా పద్దుల సంఘం (పిఏసీ) ముందు హాజరవుతానని ప్రకటించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ వ్యతరేకించారు. ఒక్క ప్రజా పద్దుల సంఘంమే కాదు.. మరే కమిటీ ముందు కూడా ప్రధాని హాజరు కావడానికి తాను సానుకూలం కాదని ప్రణబ్ తన వ్యతిరేక గళాన్ని వినిపించారు.
"మమ్మలి సంప్రదించకుండానే పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ (పీఏసీ) ముందు హాజరుకావాలని ప్రధానమంత్రి నిర్ణయించుకున్నారు. ఒకవేళ ఈ విషయం నాతో చర్చించి ఉంటే.. పిఏసి ముందు హాజరు కావద్దని నేను సలహా ఇచ్చి ఉండే వాడిన"ని పశ్చిమ బెంగాల్ పీసీసీలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రణబ్ అన్నారు. ప్రధానమంత్రి పార్లమెంట్‌కు జవాబుదారిగా ఉంటారని, ఏ కమిటీ ముందు హాజరుకారని ప్రణబ్ చెప్పారు.