Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వి ఎఫ్-06 ప్రయోగం

Advertiesment
నేడు శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వి ఎఫ్-06 ప్రయోగం
, శనివారం, 25 డిశెంబరు 2010 (10:14 IST)
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) నుంచి జీఎస్ఎల్‌వీ ఎఫ్-06 ప్రయోగం జరుగనుంది. దీనికోసం శుక్రవారం ఉదయం 11.01 నిమిషాలకు కౌంట్‌డౌన్ ఆరంభమైన విషయం తెల్సిందే. ఈ రాకెట్ ప్రయోగం శనివారం సాయంత్రం 4.01 నిమిషాలకు ప్రారంభంకానుంది.

గతంలో ఎదురైన సాంకేతిక లోపాలను పరిష్కరించి రాకెట్ ప్రయోగానికి సిద్ధం చేసినట్టు ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ వెల్లడించారు. ఈ ప్రయోగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇస్రో శాస్త్రవేత్తలు తీసుకున్నారు. రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజన్‌ను ఈ రాకెట్‌లో వాడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu