దేశంలో పెట్రేగిపోతున్న కాషాయ ఉగ్రవాదంపై దర్యాప్తు జరిపించాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్లీనరీ సదస్సు తీర్మానం చేసింది. ఆర్ఎస్ఎస్‌తో పాటు.. దాని అనుబంధ వ్యవస్థల తీర్పుపై తీవ్ర విమర్శలు గుప్పించింది. కాషాయ దళాలకు ఉన్న ఉగ్రవాద సంబంధాలపై దర్యాప్తు జరిపించాలని ఏఐసీసీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతం ఢిల్లీలో ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సమావేశాల మొదటి రోజున కాషాయ ఉగ్రవాదంపై తీర్మానం చేశారు. అంతేకాకుండా, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన ప్రసంగంలో మెజారిటీ, మైనారిటీ వర్గాల మతతత్వాన్ని తీవ్రంగా ఖండించారు.
అలాలగే, యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అవినీతిని రూపు మాపేందుకు ఐదంచెల వ్యవస్థను అమలు చేయనున్నట్టు ప్రకటించారు. రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నవాటితో సహా అవినీతి కేసుల్ని త్వరగా పరిష్కరించాలని సోనియాగాంధీ సూచించారు.