అక్రమ మైనింగ్‌పై కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన లేఖపై యాడ్యూరప్ప ఘాటుగా స్పంధించారు. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన తాను ఎవ్వరి వద్దా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
ప్రభుత్వంపై వచ్చిన భూకుంభకోణాల ఆరోపణలు, తన క్యాబినెట్ మంత్రులైన గాలిసోదరులపై వచ్చిన అక్రమ మైనింగ్ ఆరోపణలపా వివరణ ఇవ్వాలని భరద్వాజ్ మూడు రోజుల క్రితం ఓ లేఖను పంపిన సంగతి తెలిసిందే. అయితే మరికొద్ది రోజుల్లోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వాన్ని ఇరుకున పడేయడానికే గవర్నర్ ఈ చర్యకు పాల్పడి ఉంటారని విమర్శకులు అంటున్నారు.
గవర్నర్‌పై బిజెపి రాష్ట్ర ధ్యక్షుడు ఈశ్వరప్ప కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయనకు అంతగా రాజకీయాలు చేయాలని ఉంటే పంచాయితీ ఎన్నికల్లో పోటీచేయమంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు యాడ్యూరప్ప గవర్నర్‌కు రెండు లేఖలు రాశాలు అందులో తాముకాని, తమ కుటుంబసభ్యులుగాని ఎలాంటి భూకుంభకోణాలకూ పాల్పడలేదని, గాలి సోదరులకు అసలు కర్నాటకలో గనులే లేవని పేర్కొన్నారు. వారు మైనింగ్ చేస్తున్నది ఆంధ్రప్రదేశ్‌లోనే అని యాడ్యూరప్ప పేర్కొన్నారు.