2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై తనకు అప్పగించిన బాధ్యతను నూటికి నూరుపాళ్ళు విజయవంతమయ్యే విధంగా శాయశక్తులా కృషి చేస్తానని రిటైర్డ్ న్యాయమూర్తి శివరాజ్ పాటిల్ కృషి చేస్తానని వెల్లడించారు.
2జీ కుంభకోణంపై శివరాజ్ పాటిల్‌తో కూడిన ఏకసభ్య కమిషన్‌ను కేంద్ర నియమించిన నేపథ్యంలో, 2జీ స్పెక్ట్రమ్‌పై డ్రాప్టు నిబంధనలను పరిశీలించాల్సి ఉందన్నారు. 2001-09 మధ్య కాలంలో ప్రభుత్వం స్పెక్ట్రమ్ కేటాయింపులు, లైసెన్స్‌ల జారీ వంటి అంశాలపై కమిషన్ విచారణ జరుపుతుందని పాటిల్ వెల్లడించారు.
ఎడిఎ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతికి కూడా విచారణను విస్తరింపజేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు ప్రకటన చేసింది. అయితే ఈ కమిటీ ఏర్పాటును బీజేపీ తిరస్కరించిన సంగతి తెలిసిందే.