Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శివసేన నేత బాల్ థాకరేపై అరెస్ట్ వారెంట్ జారీ

శివసేన నేత బాల్ థాకరేపై అరెస్ట్ వారెంట్ జారీ
శివసేన అధినేత బాల్ థాకరేపై బీహార్ కోర్టు నాన్- బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. శివసేన పత్రిక సామ్నాలో బీహారీలను రెచ్చగొట్టే, వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు బీహార్‌లోని భోజ్‌పూర్ సబ్ డివిజినల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనపై ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

జులై- 7న కోర్టులో హాజరుకావాలని జారీ చేసిన ఆదేశాలను ధిక్కరించినందుకు బాల్ థాకరేకు తాజాగా నాన్‌- బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. 2008లో సీనియర్ న్యాయవాది రాజేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై భోజ్‌పూర్ కోర్టు విచారణ జరుపుతోంది.

పార్టీ కరపత్రికలో బాల్ థాకరే బీహారీలకు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, దీనికి సంబంధించి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజేష్ కుమార్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu