తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ మరోమారు సింగూర్ విషయంలో నానో కారు నిర్మాణానికి సంబంధించి తీసుకున్న భూమిని తిరిగి రైతులకు ఏడురోజులలో ఇవ్వాలని ఆమె కోరారు.
రైతులనుండి తీసుకున్న భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఏడు రోజులలోగా ఇవ్వాలని లేకుంటే మళ్ళీ ఆందోళన తప్పదని ఆమె పేర్కొన్నారు.
సింగూర్‌లో నానో కారును తయారుచేయాలని సంకల్పించిన టాటా కంపెనీల యజమాని రతన్ టాటా మాట్లాడుతూ మమతా బెనర్జీ కారణంగానే తమ కంపెనీని వేరే ప్రాంతానికి మార్చాల్సివస్తోందని ఆయన విమర్శించినట్లు సమాచారం.