Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బలగాలను మొహరిస్తున్న పాక్: ఆర్మీచీఫ్

బలగాలను మొహరిస్తున్న పాక్: ఆర్మీచీఫ్
, గురువారం, 15 జనవరి 2009 (10:51 IST)
భారత సరిహద్దుల పైపు పాకిస్థాన్ తమ సైన్యాన్ని మొహరిస్తోందని భారత రక్షణ శాఖ చీఫ్ మేజర్ జనరల్ దీపక్ కపూర్ వెల్లడించారు. అయినప్పటికీ తమ బలగాలు మాత్రం ఎలాంటి పరిస్థితులనైనా తిప్పికొట్టేందుకు సర్వ సన్నద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. దీనిపై ఆయన బుధవారం మాట్లాడుతూ.. 26/11 మారణహోమానికి పాల్పడిన వారు పాకిస్థాన్ భూభాగానికి చెందిన ముష్కరులే అని ఆయన స్పష్టం చేశారు.

అందువల్ల భారత్ తన మార్గాలన్నింటినీ పరిశీలిస్తోందని చెప్పారు. ముంబై దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న మాట నిజమేనని చెప్పారు. అయితే తాము యుద్ధ పరిస్థితులను సృష్టించడం లేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ముష్కరులపై చర్య తీసుకునేందుకు తాము అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు.

అందులో భాగంగా తొలుత ద్వైపాక్షిక, ఆర్థిక ఇతర మార్గాలతో కృషి చేసి, చివరగా సైనిక చర్య గురించి ఆలోచిస్తామన్నారు. అలాగే పాక్ తన బలగాలను తరలిస్తున్నట్టు వస్తున్న వార్తలకు కపూర్ ధృవీకరించారు.

ఆఫ్గన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పాక్ బలగాలను పశ్చిమ సరిహద్దుల వైపు తరలిస్తున్నాయని చెప్పారు. శత్రుదేశ చర్యలన్నింటినీ తిప్పికొట్టేందుకు భారత రక్షణ దళం సర్వ సన్నద్ధంగా ఉందన్నారు. అలాగే ఇటీవల పూంఛ్ సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ అతి కష్టమైందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu