Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్తాన్‌తో యుద్ధం చేసే యోచన లేదు: ఆంటోనీ

పాకిస్తాన్‌తో యుద్ధం చేసే యోచన లేదు: ఆంటోనీ
, మంగళవారం, 16 డిశెంబరు 2008 (13:51 IST)
పాకిస్తాన్‌తో యుద్ధం చేయాలనే ఆలోచన ఏదీ తనకు లేదని భారత్ పేర్కొంది. అయితే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడాలంటే పాకిస్తాన్ తన భూభాగంలోని ఉగ్రవాదులపై చర్య తీసుకోవలసి ఉందని స్పష్టం చేసింది.

బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో భాగంగా పాకిస్తాన్‌పై భారత మిలిటరీ విజయం సాధించి ఇప్పటికి 37 ఏళ్లు అయిన సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన విజయ్ దివస్ కార్యక్రమంలో భారత రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, తాము సైనికచర్యకు పథక రచన చేయలేదని చెప్పారు. అయితే భారత్‌కు వ్యతిరేకంగా తన భూభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులపై పాక్ చర్య తీసుకోకపోతే, పరిస్థితులు మామూలుగా మాత్రం ఉండవని ఆంటోనీ చెప్పారు.

ముంబై దాడుల అనంతరం భారత, పాక్ సరిహద్దుల మధ్య పరిస్థితి ప్రశాంతగానే ఉందని, మన సాయుధ బలగాలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఆధీన రేఖ పొడవునా గత అయిదేళ్ల పైగా ఉన్న కాల్పుల విరమణను ఉపసంహరించడానికి భారత్ ప్రయత్నిస్తున్నదన్న వార్తలను ఆంటోనీ ఖండించారు. అలాంటిదేమీ జరగలేదని స్పష్టం చేశారు.

ముంబై దాడుల నేపధ్యంలో పాక్ తన భూభాగంలో ఉన్న ఉగ్రవాదులపై నిజాయితీతో కూడిన చర్య తీసుకోవాలని ఆంటోనీ డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu