Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైమానిక దాడులు జరగొచ్చు: అంటోనీ హెచ్చరిక

Advertiesment
వైమానిక దాడులు జరగొచ్చు: అంటోనీ హెచ్చరిక
ఉగ్రవాదులు మరోమారు దాడులకు తెగబడే అవకాశం ఉందని కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ సందేహం వ్యక్తం చేశారు. భూ, సముద్ర మార్గాల ద్వారా దాడులు నిర్వహించిన ఉగ్రవాదులు ఈ దఫా వైమానికి దాడులు నిర్వహించ వచ్చని ఆయన హెచ్చరించారు. అందువల్ల త్రివిధ దళాధిపతులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అగ్రదేశం అమెరికాపై 9/11 తరహాలోనే ఈ దాడులు జరుగవచ్చని ఆయన సూచించారు. ఇలాంటి దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆయన సైనిక బలగాలను హెచ్చరించారు. రక్షణ, వైమానికి, నేవీ త్రివిధ దళాల అధిపతులతో మంత్రి ఆంటోనీ బుధవారం సాయంత్రం అత్యసర భేటీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రతా దళాలు, నిఘా సంస్థలు సమాచారాన్ని ఎప్పటికపుడు క్రోఢీకరించి పరిస్థితిని మదింపు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ సరిహద్దుల వెంబడి బలగాలు మరింత జాగరూకతతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.

కాగా, ఈ సమావేశంలో సైనిక దళాధిపతి జనరల్ దీపక్ కపూర్, వైమానికి దళాధిపతి ఫలి హోమీ మేజర్, నౌకాదళాధిపతి అడ్మిరల్ సురేష్ మెహతాలు హాజరయ్యారు. ఈ సమావేశంలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీని రెడ్ అలెర్ట్ ప్రకటించాలని నిర్ణయించారు.

Share this Story:

Follow Webdunia telugu