Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్నికలను వాయిదా వేయండి: ఒమర్ అబ్ధుల్లా

Advertiesment
వార్తలు జాతీయం జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు వాయిదా వేయండి ఒమర్ అబ్ధుల్లా
జమ్మూకాశ్మీర్ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేయాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఒమర్ అబ్ధుల్లా విజ్ఞప్తి చేశారు. జమ్మూ, కాశ్మీర్ ప్రాంతంలో విపరీతంగా మంచుకురుస్తుండటంతో త్వరలో జరుగనున్న ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని జరుపలేక పోతున్నామని ఒమర్ తెలిపారు.

ఈ ప్రాంతంలో నెలకొన్న ప్రతికూల వాతావరణంలో ప్రచారాన్ని చేపట్టడం కష్టతరమవుతుందని ఒమర్ ఈసీకి తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుని ఎన్నికలను వాయిదా వేయాలని ఒమర్ కోరారు.

భారీగా కురుస్తున్న మంచుతో జమ్మూ, కాశ్మీర్ పరిసరాల్లోని ఇళ్లముందు మంచు పేరుకుపోతుందని, రోడ్లు కూడా మంచుతో నిండిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ఒమర్ వెల్లడించారు. ఇదిలా ఉండగా.... జమ్మూలో తొలివిడత ఎన్నికలు ఈ నెల 17న జరుగుతుందని ఇటీవల ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu