Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోటాను తీసుకు వచ్చేది లేదు: దాస్ మున్షీ

పోటాను తీసుకు వచ్చేది లేదు: దాస్ మున్షీ
, శుక్రవారం, 19 సెప్టెంబరు 2008 (09:14 IST)
FileFILE
ఉగ్రవాదుల దాడులతో దేశ అంతర్గత భద్రత తీవ్రంగా చర్చనీయాంశం అవుతున్న నేపధ్యంలో దేశీయ భద్రతా యంత్రాంగాన్ని మరింతగా పటిష్టం చేస్తామని యుపిఎ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగని మళ్లీ పోటా చట్టాన్ని తీసుకు వచ్చేది లేదని స్పష్టం చేసింది. వివిధ నిఘా సంస్థలు, రాష్ట్రాల పోలీసు యంత్రాంగాలు ఉగ్రవాదం పట్ల మరింత ఐక్య వైఖరిని అవలంబించేలా సమన్వయం చేస్తూ కొత్త పథకాన్ని రూపొందిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ చెప్పారు.

అయితే ఉగ్రవాదంపై పోరాడేందుకు కఠిన చట్టాలను తీసుకు వచ్చే విషయంలో ప్రభుత్వం మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గురువారం హోంశాఖ కార్యదర్శితో కలిసి పత్రికా సమావేశంలో పాల్గొన్న ప్రియరంజన్ దాస్ మున్షీ వ్యవస్థీకృత ఉగ్రవాద వ్యతిరేక చట్టం ప్రస్తుతం అవసరం లేదని చెప్పారు.

ఈ సందర్భంగా పోటాను తిరిగి తీసుకు వచ్చే విషయంపై విలేఖరుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి పోటా చట్టం నిరంకుశమైనదని, అది పౌర హక్కులకు వ్యతిరేమైనదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను సమర్ధవంతంగా అమలు చేసినట్లయితే అదనంగా కొత్త చట్టాల అవసరం లేదన్నారు.

ఉగ్రవాదాన్ని నిరోధించే విషయంలో అమెరికా, బ్రిటన్‌ల కంటే కఠిన చట్టాలు దేశంలో అమలులో ఉన్నాయని అలాంటప్పుడు పోటాను తిరిగి తీసుకువచ్చే ప్రసక్తే లేదని దాస్ మున్షీ నొక్కి చెప్పారు. ఉగ్రవాదంపై ప్రత్యేక చట్టాలు అవసరమని కాంగ్రెస్ ప్రతినిధి, పాలనా సంస్కరణల కమిషన్ ఛైర్మన్ వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యానంతో కేంద్ర మంత్రి అభిప్రాయాలు విభేదిస్తుండటం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu