ఇంధన పెంపు వ్యవహారం విషయంలో వినియోగదారులను పూర్తిగా రక్షించలేని స్థితిలో తామున్నామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వివరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు చుక్కలను తాకుతున్న నేపథ్యంలో ఇంధన ధరల పెంపు తప్పనిసరి పరిస్థితి అని కేంద్రం గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
చమురు ధరలు పెంచితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని కేంద్రాన్ని వామపక్షాలు హెచ్చరించాయి. ఇంధనాలపై రాయితీని ఇంకా కొనసాగింతే స్థితిలో తాము లేమని స్పష్టం చేశారు. భారత ఆర్ధిక రంగ వృద్ధి రేటు గత మూడేళ్ల కాలంలో 9 శాతం చొప్పున ముందుకు సాగుతుందని మన్మోహన్ సింగ్ వివరించారు.