Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్‌కు త్వరలోనే మరో కొత్త రాజధాని: మార్గల్లా పర్వత శ్రేణుల్లో..

పాకిస్థాన్‌కు త్వరలోనే మరో కొత్త రాజధాని: మార్గల్లా పర్వత శ్రేణుల్లో..
FILE
పొరుగు దేశం పాకిస్థాన్ త్వరలోనే మరో కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకుంటోంది. మార్గల్లా పర్వత శ్రేణుల్లో కొత్త రాజధాని నిర్మాణానికి చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ కొత్త రాజధానిని, ప్రస్తుత రాజధాని ఇస్లామాబాద్‌తో సొరంగ మార్గం ద్వారా అనుసంధానం చేయనున్నారు.

రూ.77 వేల కోట్లతో చేపట్టే ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా పలు నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ వివరాలను "ది న్యూస్ డైలీ" తెలిపింది. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశించడంతో... రాజధాని అభివృద్ధి అథారిటీ (సీడీఏ) యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టింది.

అయితే... తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు ఈ కొత్త సింగారం అవసరమా? అని అక్కడి మేధావులు విమర్శిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu