Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్ ఆర్మీపై ప్రిన్స్ ప్రతీకారం తీర్చుకుంటాడు: హేమరాజ్ భార్య

Advertiesment
పాకిస్థాన్ ఆర్మీపై ప్రిన్స్ ప్రతీకారం తీర్చుకుంటాడు: హేమరాజ్ భార్య
FILE
పాకిస్థాన్ ఆర్మీ కిరాతకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. జమ్మూ- కాశ్మీర్‌‌లోని పూంఛ్‌ సెక్టార్‌లో సరిహద్దును దాటి, భారత భూభాగంలోకి ప్రవేశించి, గస్తీ తిరుగుతున్న ఇద్దరు భారత సైనికులపై పాకిస్థాన్ ఆర్మీ క్రూరంగా మెరుపుదాడి చేసి హత్య చేశారు.

ఇలా పాకిస్తాన్ సైనికుల పాశవిక చర్యకు బలైన భారత అమర సైనికుల స్వగ్రామాల్లో విషాదం అలముకుంది. హేమరాజ్, సుధాకర్ సింగ్‌ల భౌతిక కాయాలు త్రివర్ణ పతాకం చుట్టిన శవపేటికలలో ఇళ్లకు చేరాయి. హేమరాజ్ ఉత్తర ప్రదేశ్‌లోని ఖైరాడ్ గ్రామవాసి. రాత్రి పొద్దు పోయాక అతని అంత్యక్రియలు పూర్తి చేశారు. హేమరాజ్ చితికి తనయుడు నిప్పు పెట్టారు.

ఈ సందర్భంగా హేమరాజ్ మరణంపై ఆయన భార్య, తల్లి తీవ్రంగా స్పందించారు. తన కుమారుడు, హేమరాజ్ తనయుడు ప్రిన్స్‌ని కూడా సైన్యంలో పంపుతామని, తండ్రిని చంపిన పాకిస్థాన్ సైనికులపై మా వాడు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాడని హేమరాజ్ భార్య ధర్మావతి, తల్లి మీనా చెప్పారు. ప్రిన్స్ వయస్సు ప్రస్తుతం ఐదేళ్లు కావడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu