Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"గే" వివాహాన్ని చట్టబద్ధం చేయనున్న ది గ్రేట్ బ్రిటన్

Advertiesment
స్వలింగ సంపర్కుల వివాహం
, శనివారం, 17 సెప్టెంబరు 2011 (13:50 IST)
స్వలింగ సంపర్కుల సహజీవనమే కాదు ఏకంగా వారు పెళ్లిళ్లే చేసుకోవచ్చని ది గ్రేట్ బ్రిటన్ తన ఆమోదాన్ని తెలుపనుంది. ఆ దేశంలో 2015 నాటికి గే వివాహాన్ని చట్టబద్ధం చేసే ప్రణాళికను బ్రిటన్ ఆవిష్కరించింది. ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ వ్యక్తిగత జోక్యంతో స్వలింగ సంపర్కుల (గే) వివాహానికి సంబంధించిన ప్రణాళికపై ప్రభుత్వం ముందుకు కదలినట్లు ద డైయిలీ మెయిల్ తన కథనంలో వెల్లడించింది.

స్వలింగ సంపర్కుల హక్కుల కోసం బ్రిటన్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని ఈక్వాలిటీస్ మినిస్టర్ లిన్నే ఫెదర్‌స్టోన్ త్వరలో ప్రకటించనున్నారు. ప్రస్తుతం గే, లెస్బియన్స్ పౌర భాగస్వామ్యాల్లో పాల్గొనడానికి అనుమతిస్తున్నారు. దీని వల్ల వారు చాలా వరకు వివాహానికి సంబంధించి న్యాయ సంరక్షణ పొందుతున్నారు. అయితే వివాహం అనే పదం మాత్రం వాడటం లేదు.

స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవడానికి అనుమతించే విషయానికి సంబంధించిన సంప్రదింపులు వచ్చే మార్చిలో ప్రారంభించనున్నట్లు ఫెదర్‌స్టోన్ ప్రకటించనున్నారని ఆ పత్రిక తెలిపింది. ఈ ప్రణాళికల క్రింద ఒకే లింగ జంటలు విభిన్న లింగ జంటల మాదిరిగానే రిజిస్టర్ ఆఫీసుల్లో పూర్తిస్థాయి వివాహాన్ని చేసుకొనే అవకాశం లభిస్తుంది.

అయితే వారు చర్చీలు, ఇతర మత సంబంధ భవనాల్లో వివాహం చేసుకోవడం మాత్రం నిషేధం. వచ్చే ఎన్నికల సమయానికి ఈ మార్పు తీసుకురావడానికి మంత్రులు దృడ నిశ్చయంతో ఉన్నారని సంకీర్ణ వర్గాలు తెలిపాయి. వ్యక్తిగతంగా శ్రద్ధ వహిస్తున్న కామెరూన్ ఈ ప్రక్రియను వేగవంతం చేశారని ఆ పత్రిక తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu