లెబనాన్ దేశ మంత్రివర్గంలో తలెత్తిన సంక్షోభం 11 మంది మంత్రుల రాజీనామాకు దారితీసింది. ఫలితంగా సాద్ హిరీరి నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పటాయ్యేంత వరకు ఆపద్ధర్మ ప్రభుత్వానికి నేతృత్వంలో నిర్వహించాల్సిందిగా దేశాధ్యక్షుడు మైఖేల్ సులైమాన్ కోరారు.
లెబనాన్ రాజ్యాంగంలోని అధికరణం 69లోని క్లాజు ఒకటిని అనుసరించి ఈ విధంగా కోరినట్లు అధ్యక్షుడు మైఖేల్ సులైమాన్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన తెలిపింది. లెబనాన్‌లోని అత్యంత బలమైన షియా పార్టీ హిజ్బుల్లా, దాని మిత్ర పక్షాలకు చెందిన పది మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు.
దీంతో 14 నెలల సాద్ హరీరీ ప్రభుత్వం కూలిపోయింది. ప్రభుత్వం కూలిపోయేందుకు అవసరమైన కనీస సంఖ్యను సమకూర్చేందుకు అధ్యక్షునికి సన్నిహితుడైన 11 మంత్రి కూడా 30 మంది సభ్యుల కేబినెట్ నుంచి వైదొలిగారు.