అగ్రరాజ్యాల దౌత్య రహస్యాలను బయటపెట్టి నేతల కంటిపై కనుకు లేకుండా చేసిన వికీలీక్స్ వెబ్‌సైట్‌పై అమెరికా మరోసారి కన్నెర్ర చేసింది. వికీలీక్స్ వెబ్‌సైట్‌కు వచ్చే పేమెంట్ల ప్రాసెసింగ్‌ను వివిధ ఆన్‌లైన్ సంస్థలు నిలిపివేసిన అనంతరం పేపాల్ లాంటి పలు సంస్థలపై హ్యాకర్లు దాడులు ప్రారంభించారు.
వికీలీక్స్ వెబ్‌సైట్లకు మద్దతుగా పనిచేస్తున్న వెబ్‌సైట్ల ఆట కట్టించడానికి అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐ వేట కొనసాగిస్తోంది. అమెరికాలోని వివిధ నగరాలతో పాటు కెనడా, యూరప్ దేశాల్లోనూ ఎఫ్‌బిఐ అధికారులు సోదాలు నిర్వహించినట్లు స్మోకింగ్‌గన్ అనే వెబ్‌సైట్ వెల్లడించిది.
ఆస్ట్రేలియాకు చెందిన జర్నలిస్ట్ జూలియన్ అస్సాంజ్ వికీలీక్స్ వెబ్‌సైట్ ప్రారంభించాడు. అమెరికా రహస్య పత్రాలను తన వెబ్‌సైట్‌లో వెల్లడి చేస్తుండటంతో తమ దేశ ప్రతిష్టకు ఎక్కడ భంగం తలుగుతుందోనని ఆ సంస్థకు నగదు సేవలు నిలిపివేసింది. వికీలీక్స్‌కు వస్తున్న వివిధ విరాళాలను పేపాల్, వీసా, మాస్టర్‌కార్డ్ తదితర సంస్థలు నిలిపివేసిన సంగతి తెలిసిందే.