Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నైజీరియాలో బాంబు పేలుళ్లు: 37 మంది దుర్మరణం

నైజీరియాలో బాంబు పేలుళ్లు: 37 మంది దుర్మరణం
, శనివారం, 1 జనవరి 2011 (11:31 IST)
నూతన సంవత్సరం తొలిరోజే ఈజిప్ట్, నైజీరియాల్లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఈ రెండు ప్రాంతాల్లో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ళలో కనీసం 37 మంది దుర్మరణం పాలయ్యారు. అనేక మంది గాయపడ్డారు.

ఈజిప్టులోని అలెగ్డాండ్రియాలో ఓ చర్చి వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అలాలగే, నైజీరియాలోని అబూజా ప్రాంతంలో కారుబాంబు పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. పేలుడు చోటు చేసుకున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu