వాయువ్య పాకిస్థాన్‌లోని బజౌర్ గిరిజన ప్రాంతంలో శనివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 45కు చేరుకుంది. ఐక్యరాజ్య సమికితి చెందిన ప్రపంచ ఆహార పంపిణీ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది.
ఈ దాడిలో తొలి రోజున 40 మంది చెందారు. ఆ తర్వాత ఈ సంఖ్య 45కు చేరుకున్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. అలాగే, మరో 70 మంది వరకు గాయపడినట్టు వారు తెలిపారు. పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడుల కోసం మిలిటెంట్లు మహిళా మానవ బాంబును ఉపయోగించుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
గత మూడేళ్లుగా దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని ఆత్మాహుతి దాడులు జరిగినప్పటికీ ఎక్కడా మహిళా మానవ బాంబును ఉపయోగించిన దాఖలాలు లేవు. అయితే, శనివారం దాడిలో మహిళా మానవబాంబును ఉపయోగించినప్పటికీ.. ఈ దాడికి పాల్పడింది ఏ సంస్థో ఇంకా తెలియరాలేదు.