చైనా ప్రధాని వెన్ జియబావో పాక్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య 13 ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల విలువ సుమారు 20 బిలియన్ డాలర్లు. రైలు రవాణా, విద్యుత్, పునర్నిర్మాణం, వ్యవసాయం, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన ఒప్పందాలు వీటిలో ఉన్నట్లు పాక్ సమాచార శాఖ మంత్రి ఖమార్ జమాన్ కైరా తెలిపారు.
పాకిస్థాన్‌లోని 36 ప్రాజెక్టులకు చైనా ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఐదేళ్ళలో కాల వ్యవధిలో పూర్తి చేయాలనే లక్ష్యాన్ని కూడా పాకిస్థాన్‌కు చెందిన డాన్ పత్రిక వెల్లడించింది. ఈ ఒప్పందాల వల్ల తమ ఆర్థికవ్యవస్థ మరింత పటిష్ఠం అవుతుందని పాక్ భావిస్తోంది.
అయితే.. వెన్ జియబావో భారత్ పర్యటన సందర్భంగా ఇంత కన్నా ఎక్కువ మంచి ఒప్పందాలు కుదిరాయి. రానున్న ఐదేళ్ళలో ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో చైనా-పాక్‌లు ఉన్నాయనే వార్తలు వస్తుండటంతో చైనాపై పాక్ గుర్రుగా ఉంది. చైనా తమ దేశం కన్నా భారత్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని పాక్ ముభావంగా ఉన్నట్లు డాన్ పత్రిక పేర్కొంది.