Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"మూర్ఖ భారతదేశం": సింగపూర్ దౌత్యవేత్త అనుచిత వ్యాఖ్య

వికీలీక్స్ బయటపెడుతున్న రహస్య విషయాలు కొన్ని దేశాల మధ్య చిచ్చు రగిల్చేవిగా ఉంటే.. మరికొన్ని దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసేవిగా ఉన్నాయి. ప్రపంచ దేశాలను తిట్టడం, దేశాధినేతలకు మారుపేర్లు పెట్టడం వంటిది ఇప్పటి వరకూ అమెరికానే చేసిందనుకున్నాం. కానీ.. ఇప్పుడు ఆ జాబితాలోకి సింగపూర్ కూడా చేరిపోయింది.

ఇటీవల వికీలీక్స్ విడుదల చేసిన దౌత్య పత్రాలలో సింగపూర్‌కు చెందిన దౌత్యవేత్త భారత్‌ను ఓ మూర్ఖదేశంగా అభివర్ణించినట్లు అస్ట్రేలియాకు చెందిన ఫాక్స్ మీడియా సంస్థకు విడుదల చేసిన పత్రాలు వెల్లడిస్తున్నాయి. సింగపూర్ రాయబారి టామీ కో భారత్‌ను 'మూర్ఖదేశమ'ని, జపాన్ 'చిక్కిపోతోంది' అని వ్యాఖ్యానించినట్లు వికీలీక్స్ పేర్కొంది.

ఈ పత్రాల ప్రకారం.. "మూర్ఖ భారతీయ మిత్రులు.. భారత్ సగం ఆసియాన్ కూటమిలోనూ, సగం దాని బయట ఉంది" అని కో అన్నారు. గత 2008, 2009 మధ్యకాలంలో సీనియర్ అమెరికా అధికారులైన డిఫెన్స్ డిప్యూటీ సెక్రటరీ ఫర్ ఈస్ట్ ఏషియా డేవిడ్ సిడ్నీలతో సింగపూర్ విదేశీ వ్యవహారాల అధికారులు వ్యాఖ్యానించినట్లు వెల్లడైంది.

అంతే కాకుండా.. మలేసియా, థాయ్‌ల్యాండ్, జపాన్ తదితర దేశాలపై వారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. జపాన్ నాయకత్వానికి సరైన ధృక్పధం లేదని, మలేసియాకు సరైన నాయకత్వం లేకపోడం ప్రధాన సమస్య అని వారు వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu