Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇజ్రాయిల్‌ను చుట్టుముట్టిన కార్చిచ్చు: 40 మంది మృతి

Advertiesment
ఇజ్రాయిల్‌ను చుట్టుముట్టిన కార్చిచ్చు: 40 మంది మృతి
ఇజ్రాయిల్‌పై అగ్ని దేవుడు కన్నెర్ర చేశాడు. ఇజ్రాయిల్‌ చరిత్రలోనే ఎన్నుడూ లేని విధంగా అత్యంత దారుణమైన దావాగ్ని చెలరేగి 40 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇటీవల రష్యాలో జరిగిన సంఘటన మర్చిపోకమునుపే.. ఇజ్రాయిల్‌లో చెలరేగిన కార్చిచ్చు అక్కడి ప్రజలను కలచి వేస్తుంది.

గురువారం మధ్యాహ్నం హైఫా నగరానికి ఆగేయాన ఉన్న కార్మెల్‌ కొండపైన ప్రారంభమైన ఈ కార్చిచ్చు మార్గమధ్యంలో అడ్డు వచ్చిన ప్రతి ఒక్క దాన్నీ చేసుకుంటూ వెళ్లింది. ఈ ఊహించని ఉపద్రవంతో బెంబెలెత్తిన దాదాపు 13 వేల మంది ప్రజలు తమ ఇళ్లను వదలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.

'ఈ ఉపద్రవం, మనమెన్నడూ ఎరగనటువంటిద'ని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ అన్నారు. ఈ కార్చిచ్చును ఆర్పడంలో తోడ్పడాల్సిందిగా రష్యా, సైప్రస్‌, గ్రీస్‌, ఇటలీ, తదితర దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రీస్‌, సైప్రస్‌, ఫ్రాన్స్‌, ఈజిప్టు తదితర దేశాలకు చెందిన 24 అగ్నిమాపక విమానాలు, ఇతర పరికరాలు ఇజ్రాయిల్‌కు చేరుకుని మంటలార్పే ప్రక్రియను ప్రారంభించాయి.

Share this Story:

Follow Webdunia telugu