Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెరుగుతున్న కాలుష్యం: తరముకొస్తున్న ఆహార సంక్షోభం

పెరుగుతున్న కాలుష్యం: తరముకొస్తున్న ఆహార సంక్షోభం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతన్న కాలుష్యం కారణంగా భవిష్యత్తులో మానవ మనుగడ మరింత దుర్భరంగా మారనుందని అంతర్జాతీయ నిపుణుల హెచ్చరిస్తున్నారు. 2050 సంవత్సరం నాటికి ఆహారోత్పత్తుల ధరలు రెట్టింపు కావడమే కాక.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడే ప్రమాదం ఉందని శాస్తజ్ఞ్రులు చెబుతున్నారు.

ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమైన ఉద్గారాల విడుదలను ఇప్పటికిప్పుడు నిలిపి వేసినప్పటికీ ఆహారోత్పత్తుల ధరలు క్రమేపి పెరుగుతాయని, ఈ పరిస్థితి ఈ శతాబ్దంలోనే అనుభవంలోకి వస్తుందని వారు వివరిస్తున్నారు. 2050 నాటికల్లా ఉష్ణోగ్రతలు 20వ శతాబ్దపు స్థాయితో పోలిస్తే దాదాపు 6.4 డిగ్రీల సెల్సియస్ దాకా పెరిగి పోవచ్చని, ఆ తర్వాత ప్రపంచమంతటా వ్యవసాయానికి కష్టకాలం వచ్చే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ఆహార విధానం పరిశోధనా సంస్థకు చెందిన సీనియర్ పరిశోధకుడు గెరాల్డ్ నెల్సన్ తెలిపారు.

15 దేశాల జనాభా, వారి ఆదాయ వివరాలను, భవిష్యత్తు అంచనాలను వాతావరణానికి సంబంధించిన సూపర్ కంప్యూటర్లలోకి తాము ఫీడ్ చేసామని, వాతావరణ మార్పులు, భవిష్యత్తులో మానవ మనుగడను ముఖ్యంగా ప్రపంచంలోని అత్యంత పేదల బతుకులను దుర్భరంగా మార్చుతాయని ఈ విశ్లేషణల్లో తేలిందని వాషింగ్టన్‌లోని ఈ సంస్థకు చెందిన శాస్తవ్రేత్తలు పేర్కొన్నారు. మెక్సికోలోని కాంకన్‌లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి వార్షిక వాతావరణ సదస్సులో ఈ నివేదికలను విడుదల చేసారు.

Share this Story:

Follow Webdunia telugu