Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా అధికారులను కలవనున్న సిబాల్

Advertiesment
అమెరికా అధికారులను కలవనున్న సిబాల్
, మంగళవారం, 27 అక్టోబరు 2009 (11:35 IST)
FILE
భారత్, అమెరికా దేశాల మధ్య విద్యారంగంలో పెనుమార్పులు తీసుకు వచ్చేందుకుగాను కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి కపిల్ సిబాల్ అమెరికాకు చెందిన ప్రభుత్వ అధికారులతో సమావేశం కానున్నారు.

అమెరికా విదేశాంగ శాఖామంత్రి హిల్లరీ క్లింటన్ ఈ ఏడాది జులైలో భారతపర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచుకునేందుకు విద్యారంగంలో మంచి పట్టు సాధించాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో సిబాల్ సోమవారం న్యూయార్క్‌లో హావర్డ్‌యేల్, మసాచుయేట్స్ విశ్వవిద్యాలయాధికారులతో సమావేశమైనారు. సమావేశంలో ఇరు దేశాలకు చెందిన విద్యాసంస్థల మధ్య ఓ ప్రత్యేక ఒప్పందం, సహాయ సహకారాలకు సంబంధించి చర్చలు జరిగాయని ఆయన వెల్లడించారు.

మంగళవారం ఆయన వాషింగ్‌టన్ పర్యటించనున్నారు. ఈ యాత్రలో భాగంగా విదేశాంగశాఖ, విద్యాశాఖాధికారులతో సమావేశం కానున్నారు. అక్కడున్న పలు విశ్వవిద్యాలయాల అధ్యక్షులతోపాటు భారతదేశానికి చెందిన విద్యావేత్తలతో సమావేశం కానున్నారు.

Share this Story:

Follow Webdunia telugu