Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు : అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిందే!!

Advertiesment
చంద్రబాబు : అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిందే!!
, మంగళవారం, 26 నవంబరు 2013 (09:09 IST)
File
FILE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ఇరు ప్రాంత ప్రజలను ఒప్పించాల్సిందేనని లేకుంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. విభజన అంశంపై ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. విభజనపై కేంద్రం రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

విభజనకు ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరముందన్నారు. గతంలో అసెంబ్లీ తీర్మానాల ద్వారానే మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇదే విధానాన్ని కూడా ఇక్కడ పాటించాలన్నారు. కానీ, ఇక్కడ మాత్రం అసెంబ్లీని చులకన చేస్తే ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు.

371(డి), 371(ఇ) ఆర్టికల్స్‌ను సవరించాలంటే పార్లమెంట్‌లో 2/3 మెజారిటీ అవసరమన్నారు. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే జాతీయ పార్టీలేవీ అంగీకరించవని, తాము కూడా ఒప్పుకోబోమని తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా ముందు మాట్లాడలేకపోతున్నారని ఆరోపించారు. ఇక తనపై కేసుల మాఫీ కోసం వైసీపీ నేత వైఎస్ జగన్ బిజీగా ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu