ఏపీలో రాష్ట్రపతి పాలన అనేది చివరి అస్త్రం : పీసీ చాకో
, గురువారం, 10 అక్టోబరు 2013 (14:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం అనేది చిట్ట చివరి అస్త్రమని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో అన్నారు. ఆయన గురువారం ఢిల్లీలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉందని, అక్కడ శాంతిభద్రతలు కాపాడటం దాని బాధ్యత అని గుర్తు చేశారు. శాంతి భద్రతలు అదుపులో పెట్టాలని తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరినట్టు ఆయన వెల్లడించారు. విధినిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనప్పుడు, ఇతర మార్గాలు లేనప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన వస్తుందని చాకో స్పష్టం చేశారు.