Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టి నోట్ 22 పేజీల్లో ఓ పేజీ ఔట్ : అందులో ఏముందంటే...

Advertiesment
టి నోట్ 22 పేజీల్లో ఓ పేజీ ఔట్ : అందులో ఏముందంటే...
, గురువారం, 3 అక్టోబరు 2013 (16:56 IST)
File
FILE
22 పేజీలతో తయారు చేసిన టి నోట్‌లో ఒక పేజీ గురువారం లీక్ అయింది. ఈ పేజీలో కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ప్రధానంగా 10 జిల్లాల తెలంగాణ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండటం, ఉభయ రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్‌లను నియమించడం వంటి అంశాలతో తెలంగాణ నోట్‌ను సిద్ధం చేశారు. ఆ నోట్ కాపీ ఒకదానిని ఆయన బయటకు తీసుకు వచ్చారు.

నోట్‌లోని మొదటి పేజీని ప్రసార మాధ్యమాలు చూపించాయి. దాని ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. కొత్త రాజధానిని సీమాంధ్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. అలాగే రాజ్యసభ సీట్లు ఆంధ్రకు 10, తెలంగాణకు 8ని కేటాయించారు. ఇలాంటి ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి.

ముఖ్యంగా.. తెలంగాణ ఎమ్మెల్యేలు 119 మంది ఉంటారు. అందులో ఎస్సీలు 19, ఎస్టీలు 12. లోక్‌సభ స్థానాలు 17 ఉంటాయి. అందులో 3 ఎస్సీలకు, 2 ఎస్టీలకు కేటాయించారు. రాజ్యసభ సభ్యులు 8 మంది ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లో (సీమాంధ్ర) 175 ఎమ్మెల్యే స్థానాలుంటాయి. వీటిలో ఎస్సీలు 29, ఎస్టీలు 7. 25 లోక్‌సభ స్థానాల్లో 4 ఎస్సీలకు, ఒకటి ఎస్టీలకు కేటాయించారు. రాజ్యసభ సభ్యలు 10 మంది ఉంటారు.

Share this Story:

Follow Webdunia telugu