Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టెక్కీ అశ్వినీ నాయర్ ఆత్మహత్య : ప్రేమ విఫలమే కారణమా...?

Advertiesment
టెక్కీ అశ్వినీ నాయర్ ఆత్మహత్య : ప్రేమ విఫలమే కారణమా...?
, బుధవారం, 10 జులై 2013 (12:13 IST)
File
FILE
హైదరాబాద్‌‌లో ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి చెందిన అశ్వనీ నాయర్ అనే ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేమ విఫలమే కారణంగా తెలుస్తోంది. ఈమె మంగళవారం భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. గచ్చిబౌలీలో ఉన్న ఒరాకిల్ కంపెనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇది స్థానిక ఉద్యోగుల్లో కలకలం రేపింది.

తాను ప్రేమించిన వ్యక్తితో ప్రేమ విఫలం కావడంతో ఒత్తిడికి లోనైన ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా తేలింది. ఆమె ఉద్యోగం చేరిన 15 రోజుల్లోనే ఈ అఘాయిత్యానికి పాల్పడటం సంచలనంగా మారింది. ప్రేమించిన యువకుడు తనకు దూరమవుతున్నాడని గ్రహించే అశ్వినీ నాయర్ ఈ బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

అశ్వినీ అత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్ రాసి పెట్టింది. జీవితంపై విరక్తితోనే తనువు చాలించానని ఆమె తన డైరీలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా, ఇదే ప్రాంతంలో కొంతకాలం క్రితం నీలిమ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఇన్ఫోసిస్ కార్యాలయంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెల్సిందే. దీన్ని ఆ ప్రాంత సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మరచిపోక ముందే మరో సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu