Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నీటి సంద్రమైన సిక్కోలు: నిమ్మాడలో ఎర్రన్న అంత్యక్రియలు

Advertiesment
ఎర్రన్నాయుడు
FILE
నిమ్మాడలోని వ్యవసాయ క్షేత్రంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎర్రన్నాయుడు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతకు ముందు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్, పార్టీ నేతలు ఎర్రన్నాయుడుకు కడసారి వీడ్కోలు పలికారు. ఎర్రన్న చితికి కుమారుడు రామ్మోహన్ నాయుడు నిప్పంటించారు.

అంతకుముందు ఎర్రన్న భౌతికకాయం వద్ద పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవవందనం సమర్పించారు. తన నేతను చివరిసారిగా చూసేందుకు వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నిమ్మాడలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన ఎర్రన్న అంత్యక్రియలకు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అభిమానులు, కార్యకర్తల రోదనతో సిక్కోలు కన్నీటి సంద్రమైంది.

Share this Story:

Follow Webdunia telugu