తల్లీబిడ్డ ఊరుమీద పడి ఏడవడం వల్లే వైకాపా గెలిచింది: ఎర్రబెల్లి
, బుధవారం, 20 జూన్ 2012 (12:21 IST)
తల్లీబిడ్డ ఇద్దరూ ఊళ్లపై పడి ఏడవడం వల్లనే మొన్నటి ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జగన్ జైలుకెళ్లడంతో ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఇద్దరూ ఊళ్లపైబడి ఏడ్వటంతో ప్రజల కరిగిపోయారనీ, అందువల్లనే ఆ పార్టీ గెలిచిందని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కోట్లకొద్దీ అవినీతికి పాల్పడినప్పటికీ ఎంతోకొంత మంచి చేసిండనీ, అవి కూడా ఓట్ల రూపంలో వైకాపాకు పడ్డాయని చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణ ఈ ఏడాదిలోనే వచ్చేట్లు కనబడుతోందని అన్నారు. తెలంగాణలో తెరాస చేస్తున్న మోసాలను ప్రజలు గ్రహించారనీ, అందువల్లనే ఆ పార్టీ పరకాల ఎన్నికల్లో చావుదప్పి కన్నులొట్ట పోయినట్లుగా గెలిచిందన్నారు.