Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 9 March 2025
webdunia

ఎస్మా ప్రయోగిస్తే ఉద్యోగులకు ఉలుకెందుకో: ఎర్రబెల్లి

Advertiesment
ఎస్మా ప్రయోగిస్తే ఉద్యోగులకు ఉలుకెందుకో: ఎర్రబెల్లి
సకల జనుల సమ్మెలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులపై ఎస్మా చట్టం ప్రయోగిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తుంటే కొంతమంది ఉద్యోగులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావడం లేదని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దీనిపై ఆయన మంగళవారం మాట్లాడుతూ చిత్తశుద్ధితో తెలంగాణ ఉద్యమం చేస్తున్నామని చెబుతున్న కొందరు ఉద్యోగులు ఎస్మా ప్రయోగాన్ని ప్రశ్నించడమేమిటని అడిగారు. సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన నిలదీశారు.

ఉద్యోగ సంఘాల ప్రతినిధులుగా పని చేసే కొంతమందికి పదవీ కాంక్ష ఉందని ఆరోపించారు. అందుకే మిగిలిన ఉద్యోగులను పెడదారి పట్టిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఉద్యమం అంటే కేవలం తెలుగుదేశం పార్టీనే లక్ష్యంగా చేసుకోవడమా అని ఎర్రబెల్లి ప్రశ్నించారు.

తనకు ప్రజా పద్దుల సంఘం ఛైర్మన్ గిరి కావాలని అసమ్మతి శాసనసభ్యుడు హరీశ్వర్ రెడ్డి తన ముందే పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని అడిగారని అన్నారు. అది రాక పోవడం వల్లనే తెదేపాపై విమర్శలు గుప్పిస్తూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఇకపోతే.. సకల జనుల సమ్మెలో పాల్గొనే సీమాంధ్ర ఉద్యోగులపై, హైదరాబాద్‌‍లోని సెటిలర్లపై భౌతిక దాడులు చేస్తామని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ హెచ్చరికలు చేయడాన్ని ఎర్రబెల్లి తప్పుబట్టారు. ఆయన ఉద్యమాన్ని మళ్లీ వెనక్కి తీసుకెళుతున్నారా అని ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu