ప్రజా సమస్యలపై మాజీ కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డికిగానీ, ఆయన వర్గానికిగానీ చిత్తశుద్ధి లేదని కృష్ణాజిల్లా ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు.
నిజంగానే ప్రజా సమస్యలపై జగన్‌కు, ఆయన వర్గీయులకు చిత్తశుద్ధి ఉంటే మాతో కలిసిపోరాడాలని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. ప్రచారం కోసమే జగన్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని వెల్లంపల్లి అన్నారు. ప్రజారాజ్యం పార్టీపై జగన్ వర్గీయులు చేస్తున్న విమర్శలను వెల్లంపల్లి ఈ సందర్భంగా కొట్టిపారేశారు.
ఇదిలా ఉంటే.. కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్న రచ్చబండ కార్యక్రమంగా గురువారం రసాభాసగా మారింది. జుపాడు బంగ్లా ఎస్సీకాలనీలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఇళ్లపట్టాలు కేటాయింపు, తమకు ఎస్సీ హోదా కల్పించాలంటూ బుడగజంగాలు ఆందోళనకు దిగారు.