Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రజారాజ్యం పార్టీకి జగన్ ఫీవర్: ఎమ్మెల్యేలపై నిఘా నేత్రం!!

Advertiesment
ప్రజారాజ్యం పార్టీకి జగన్ ఫీవర్: ఎమ్మెల్యేలపై నిఘా నేత్రం!!
, బుధవారం, 19 జనవరి 2011 (12:19 IST)
రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన దివంగత నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు వై.ఎస్. జగన్మోహన రెడ్డి అంటేనే అటు కాంగ్రెస్‌తో పాటు తెలుగుదేశం పార్టీ కూడా కాస్త జడుసుకుంటోంది. తాజాగా ప్రజారాజ్యం పార్టీకి కూడా యువనేత జగన్ ఫీవర్ పట్టుకున్నట్లుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

పీఆర్పీకి చెందిన శాసనసభ్యులు శోభానాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డి వై.ఎస్. జగన్‌కు మద్దతు పలుకుతున్న నేపథ్యంలో, పీఆర్పీ అధినేత చిరంజీవి అమోమయంలో పడ్డారు. అంతేగాకుండా మిగిలిన శాసనసభ్యులు కూడా జగన్ వైపు వెళ్లిపోకుండా వారికి బ్రేక్ వేసే దిశగా చిరంజీవి సన్నాహాలు మొదలెట్టారని తెలిసింది.

ఈ క్రమంలో వై.ఎస్.జగన్ విశాఖపట్నంలో ఈ నెల 22వ తేదీన జరుపనున్న జనదీక్షలో తమ పార్టీకి చెందిన శాసనసభ్యులు వెళ్లకుండా జాగ్రత్తపడాలని చిరంజీవి భావిస్తున్నట్లు తెలిసింది. జగన్ వెంట వెళ్లిన ఇద్దరు శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాలని చిరు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే విశాఖ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu